కారులో 10 కేజీల గంజాయి తరలింపు.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అరెస్టు

-

కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు టెకీలను పోలీసులు అరెస్టు చేశారు.సికింద్రాబాద్ పరిధిలోని జింఖానా గ్రౌండ్స్‌ పరిసరాల్లో ఇన్నోవా కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముందుగా కారులో సోదాలు చేయగా..దాదాపు 10 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నిందితులు ఇద్దరు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారని సమాచారం.

ఉద్యోగం చేస్తూనే..ఆంధ్ర నుంచి హైదరాబాద్‌‌కి గంజాయి అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరు ప్రవీణ్ వర్మ జల్సాలకు అలవాటు పడి కంపెనీ ఇచ్చే జీతం సరిపోక ఈ గంజాయి అక్రమ రవాణా కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఆంధ్ర- ఒరిస్సా బోర్డర్ నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి సెల్ ఫోన్లు, ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version