తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గురుకుల విద్యార్థినిపై లైంగిక దాడికి ఉపాధ్యాయుడు పాల్పడింది. కరీంనగర్ జిల్లాలోని ఒక గురుకులంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు జూనియర్ లెక్చరర్. వార్షిక పరీక్షల అనంతరం వేసవి సెలవుల కోసం ఇంటికి వెళ్లిన బాలికకు నెలసరి రాకపోవడంతో అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు తల్లిదండ్రులు.
కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలోని వైద్యురాలు, బాలికపై ఎవరైనా అత్యాచారయత్నం చేశారేమోనని అనుమానం వ్యక్తం చేయడంతో, బాలికను ప్రశ్నించారు తల్లిదండ్రులు. గత నెలలో ఒక జూనియర్ లెక్చరర్ తనను గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి జూనియర్ లెక్చరర్‌ను రిమాండ్‌కు తరలించారు పోలీసులు. గురుకుల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు.