ఇవాళ, రేపు భారీ వర్షాలు… టోల్ ఫ్రీ నెంబర్స్ ఇవే

-

తెలంగాణ, ఏపీ ప్రజలకు అలెర్ట్. ఇవాళ, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా,రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనిపైగా ఆగ్నేయ బంగాళాఖాతం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు విస్తరించింది ద్రోణి. దీని ప్రభావంతో నేడు, రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

rain
Heavy rains today and tomorrow These are the toll-free numbers

గంటకు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అటు ఏపీలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా రిలీజ్ చేశారు. అత్యవసర సహాయం,సమాచారం కొరకు విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101 ఏర్పాటు చేశారు. శ్రీసత్యసాయి, చిత్తూరు కర్నూలు,నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి, తూర్పుగోదావరి,పశ్చిమ గోదావరి,కోనసీమ,కృష్ణా, గుంటూరు,పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news