త‌ర‌గ‌తి గ‌దిలో విద్యార్థుల మధ్య గొడ‌వ‌.. ఒక‌రు మృతి

-

త‌ర‌గ‌తి గ‌దిలో విద్యార్ధులు స‌ర‌దాగా ఆడుకున్న ఆట.. ఒక‌రి ప్రాణం తీసింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని కృష్ణా న‌గ‌ర్ లోని సాయి కృప పాఠ‌శాల‌లో చోటు చేసుకుంది. కాగ కృష్ణా న‌గ‌ర్ లోని సాయి కృప పాఠ‌శాల‌లో ప‌ది త‌ర‌గ‌తి విద్యార్థులు పేప‌ర్ బాల్ తో స‌ర‌దాగా క్రికెట్ ఆడుకున్నారు. ఈ క్ర‌మంలో ఆట మ‌ధ్య భాగంలో విద్యార్థుల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. దీంతో న‌లుగురు విద్యార్థులు ఒక్క‌రిపై నొక‌రు దాడి చేసుకున్నారు. ఈ దాడి తీవ్రం గా మారింది.

దీంతో మ‌న్సూర్ అనే ప‌దో త‌ర‌గ‌తి విద్యార్ధికి తీవ్ర గాయాలు అయ్యాయి. తొటి విద్యార్థులు ఉపాధ్యాయులకు స‌మాచారం అందించారు. దీంతో ఉపాధ్యాయులు.. మ‌న్సూర్ నే అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డి వైద్యులు మ‌న్సూర్ ప‌రిశీలించ‌గా.. అప్ప‌టికే మ‌న్సూర్ మృతి చెందాడ‌ని వైద్యులు ధృవీకరించారు. దీంతో స‌మాచారం అందుకున్న జూబ్లీ హీల్స్ పోలీసులు.. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version