హైదరాబాద్ : చిలకల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్ అక్కా(17) చెల్లెలను(15)ప్రేమిస్తున్నామంటూ మోసం చేశాడు నావాజ్ (21).. ఇంతియాజ్..(21) అనే ఇద్దరు యువకులు. అంబట్ పేట్ కు చెందిన ఇద్దరు యువకులు… అంబర్ నగర్ లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన అక్కా, చెల్లెలను పేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.
గత రెండు సంవత్సరాలుగా ప్రేమ పేరుతో అత్యాచారం చేసి బ్లాక్ మొయిల్ చేసినట్లు సమాచారం అందుతోంది. అమ్మాయిల తండ్రి ఎన్నిసార్లు యువకులను మందలించినా వినకపోవడంతో.. వారి పై చిలుకల గూడ పోలీసులకు పిర్యాదు చేశాడు అమ్మాయిల తండ్రి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. ఇక ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది… అలాగే దీనిపై పోలీసులు… ప్రెస్ మీట్ కూడా పెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం.