పుష్ప-2 కోసం అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లు అంటే..?

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం మొదటి భాగం మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా మొదట పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలను కోలేదు.. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేయడం జరిగింది. ఎట్టకేలకు ఈ సినిమా అన్ని భాషలలో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇక ఇప్పుడు పుష్ప-2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. అయితే ఈసారి ఇందులోని నటుల పారితోషికం విషయంతో పాటు హీరో, దర్శకుడు బాగానే లాభపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది వాటి గురించి చూద్దాం.పుష్ప చిత్రానికి మొదట నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఒక్కసారిగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కురిపించింది. ఇక బాలీవుడ్ లో అయితే దాదాపుగా రూ.100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక పార్ట్ 2 పై హీరో దర్శకుడు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు పనులు అయితే ఇప్పటికే పూర్తి అయ్యాయి. కానీ ఇందులోని కొన్ని సన్నివేశాలు అంచనాలకు తగ్గట్టుగా లేవని డైరెక్టర్ మరొకసారి కొత్త స్క్రిప్ట్ రాయడానికి సిద్ధమైనట్లు సమాచారం.

ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలోని వారందరి పారితోషకాలు మరింత పెరగనున్న ట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మొదటి పార్ట్ బాగానే విజయం అందుకోవడం తో సెకండ్ పార్ట్ మార్కెట్ వ్యాల్యూ కూడా భారీగానే పెరిగిపోయింది. దీంతో ఈ చిత్రం బిజినెస్ కూడా రూ.750 కోట్లకు పైగా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇక డైరెక్టర్ దాదాపుగా ఈ చిత్రానికి రూ.65 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకునే అవకాశం ఉందట. కానీ సుకుమార్ సినిమాలో లాభాలలో వాటాను అందుకునే విధంగా అగ్రిమెంట్ చేయించుకున్నట్లు సమాచారం. మొదటి భాగానికి రూ.35 కోట్ల రూపాయల వరకు అందుకున్నట్లు సమాచారం.

ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప-1 కొసం రూ.45 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది ఇక సెకండ్ పార్ట్ కు మాత్రం రెమ్యూనరేషన్ కాకుండా సినిమాలోని వాట తీసుకునేందుకు అగ్రిమెంట్ చేయించుకున్నట్లు సమాచారం. దీంతో అల్లు అర్జున్ కి దాదాపుగా రూ.100 కోట్లకు పైగా రాబోతోందని సమాచారం. ఇంత పారితోషికం అతి తక్కువ సమయంలో అందుకోవడంతో ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version