గుంటూరు జిల్లాలో దారుణం: తల్లిని చంపిన మరో కూతురు..

-

రోజురోజుకు మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. హయత్‌నగర్‌లో తల్లిని చంపిన కీర్తిరెడ్డి కేసును మరవక ముందే తెలుగు రాష్ట్రాల్లో మరో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిని ఆస్తికోసం కాటికి పంపిందో కఠినాత్మురాలు. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జన్మనిచ్చిన తల్లిని అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ విషాదఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తన తల్లి ఆలపాటి లక్ష్మి మరణిస్తేనే ఆస్తి తనకు దక్కుతుందని భావించిన భార్గవి అనే మహిళ తన భర్త సాయంతో కన్న తల్లిని మట్టుబెట్టింది. భర్త, బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టిన‌ట్టు తెలుస్తోంది.

అయితే దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన నిజాన్ని బయటపెట్టారు. ఆస్తిని తన పేర రాయాలని కొన్ని రోజులుగా తల్లిపై తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది భార్గవి. ఈ క్రమంలో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తల్లిని చంపేసి, ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేసింది. పథకం ప్రకారం.. భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తల్లిని చేసింది. ఐతే తల్లి హత్యపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని.. కేసు పెట్టవద్దని భార్గవి చెప్పడంతో పోలీసులుకు అనుమానాలు మొదలయ్యాయి. లోతుగా దర్యాప్తు చేస్తు అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. మెుత్తానికి తెలుగు రాష్ట్రాల్లో తల్లులు పాలిట కుమార్తెలు యముడిగా మారారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version