చీకోటి ప్రవీణ్‌ విదేశీ ప్రయాణాలపై ఈడీ ఆరా!

-

క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు చీకోటి ప్రవీణ్‌ను విచారించిన ఈడీ అధికారులు.. అతడి నుంచి సేకరించిన ఆధారాలను విశ్లేషిస్తున్నారు. గత 10ఏళ్ళుగా ప్రవీణ్‌ ఎన్ని దేశాలు తిరిగాడనే అంశంపై ఈడీ లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రవీణ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలనూ సేకరించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు దాఖలు చేసిన ఆదాయపు పన్ను వివరాలను ప్రవీణ్‌ నుంచి సేకరించిన ఈడీ.. వాటిని సంబంధిత అధికారులకు పంపి విశ్లేషించనుంది.

గత పదేళ్లుగా చీకోటి ప్రవీణ్‌ విదేశీ ప్రయాణాల వివరాలను సేకరించిన ఈడీ అధికారులు.. అతడు ఏయే దేశాలు వెళ్లాడు? ఏ పనిమీద వెళ్లాడు? అక్కడ చేసిన లావాదేవీలు, విదేశాలకు వెళ్లే ముందు ఇక్కడ చేసిన ఆర్థికపరమైన లావాదేవీలపైనా విచారించింది. దీంతో పాటు ఇప్పటిదాక ఫైల్‌ చేసిన ఆదాయపు పన్ను వివరాలు సేకరించిన అధికారులు.. ప్రవీణ్‌తో పాటు అతడి బంధువుల బ్యాంకు ఖాతాల వివరాలను కనుక్కొన్నట్టు సమాచారం. ప్రవీణ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు డైరెక్టర్లు, భాగస్వాములుగా ఉన్న కంపెనీలపై అతడిని ఆరా తీసింది.

అయితే, తనకు ఎలాంటి కంపెనీలూ లేవని ప్రవీణ్‌ ఈడీకి చెప్పినట్టు తెలుస్తోంది. బ్యాంకు లావాదేవీలతో పాటు ప్రవీణ్‌ స్థిర, చరాస్తుల వివరాలను సైతం ఈడీ సేకరించింది. వీటితో పాటు అతడి పాస్‌ పోర్టు వివరాలను తీసుకున్న అధికారులు.. ఆ వివరాలన్నింటినీ విశ్లేషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version