దారుణం : కొడుకు కోసం భార్య‌కు 8 సార్లు అభార్ష‌న్లు.. 1500 స్టిరాయిడ్లు

దేశం ఎంతో ముందుకు వెళ్తున్నా కూడా ఇంకా చాలామంది పాత‌కాలం మ‌నుషుల్లాగే ఆలోచిస్తున్నారు. అన‌వ‌స‌ర న‌మ్మ‌కాల‌కు పోయి కుటుంబాల‌ను ఆగం చేసుకుంటున్నారు. ప్ర‌స్తుత కాలంలో అమ్మాయిలు ఎన్ని సాధిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. మ‌గ‌వారితో స‌మానంగా అన్ని ప‌నుల్లోనూ ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. తాము అబ్బాయిల‌కు ఏ మాత్రం త‌క్కువ కాద‌ని నిరూపిస్తున్నారు. అయితే ఇప్ప‌టికి కూడా చాలామంది త‌మ‌కు కొడుకే పుట్టాల‌ని కోరుకుంటున్నారు. కొడుకు పుడితేనే త‌మ బాధ‌ల‌ను తీరుస్తాడ‌ని న‌మ్ముతున్నారు.

ఇక త‌మ ఇంటిపేరును అలాగే వంశాన్ని నిల‌బెట్టేది కూడా వారసుడే కాబ‌ట్టి క‌చ్చితంగా కొడుకే కావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంటున్నారు. ఇందుకోసం దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇప్పుడు కూడా ఓ ఉన్మాది భర్త కొడుకు కోసం ఎవ‌రూ ఊహించ‌ని దారుణాల‌కు పాల్ప‌డ్డాడు. ఏకంగా త‌న భార్యకు ఎనిమిది సార్లు అబార్షన్‌ చేయించాడు. ఇక ఇన్నిసార్లు అబార్షన్ చేసిన గ‌త‌ర్వాత ఆమెకు హెల్త్ బాగా లేకున్నా స‌రే త‌నుకు మాత్రం కొడుకును కన్నాలనే ఉన్మాదాన్ని కొనసాగించాడు.

ముంబైకి చెందిన 40 ఏళ్ల బాధితురాలికి ఓ లాయ‌ర్ పెండ్లి అయింది. కాగా 2007లో వీరికి వివాహం కాగా ఆ వ్యక్తి కొడుకు కోసం ఏకంగా ఆ బాధితురాలికి ఇప్ప‌టి వ‌ర‌కు 1,500 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించాడు. ఇన్ని చేస్తున్నా మౌనంగా భ‌రించిన ఆ మ‌హిళ ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ అత్యంత దారుణమైన ఘ‌ట‌న వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు స‌భ్య స‌మాజం భ‌గ్గుమంటోంది. కొడుకు కోసం ఇంత‌టి దారుణాల‌కు పాల్ప‌డ‌మేంట‌ని అంతా మండి ప‌డుతున్నారు. భార్య నోరు విప్పితేనే గానీ ఇలాంటి దారుణాలు నాలుగు గోడలు దాటి బయటకు రావు క‌దా.