ఫేస్ బుక్ లైవ్ లో పురుగుల మందు తాగిన రైతు

అప్పుల బాధ తో ఒక రైతు ఆత్మ హ‌త్య చేసుకున్నాడు. త‌ను ఎందుకు చ‌నిపోతున్నానో అని ఫేస్ బుక్ లైవ్ పెట్టి విడీయో రికార్డు చేసి మ‌రి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కాగ ప్ర‌కాశం జిల్లా లోని పొన్న‌లూర్ మండ‌లం పెరిక‌పాలెం గ్రామం లో కుంకు వెంక‌టేశ్వ‌ర్లు (38) నివాసం ఉంటున్నాడు. ఇత‌నికి ఒక భార్య‌.. ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. వెంక‌టేశ్వ‌ర్ల‌కు 4 ఎక‌రాల భూమి ఉంది. ఇక్క‌డ న‌ష్టాలు రావ‌డం తో బ‌ళ్లారి లో 16 ఎక‌రాల పొలాన్ని కౌలు కు తీసుకున్నాడు.

ఈ పొలం లో అంజూర తోటలు వేశాడు. అయితే క‌రోనా వైర‌స్ వ‌ల్ల లాక్ డౌన్ తో పాటు భారీ వ‌ర్షాల వ‌ల్ల తీవ్రంగా న‌ష్ట పోయాడు. అలాగే భారీ గా అప్పుల పాలు అయ్యాడు. దీంతో వెంక‌టేశ్వ‌ర్లు త‌న అత్త వారి గ్రామానికి వ‌చ్చి గోర్రెల కాపారి గా పని చేశాడు. అయితే త‌న‌కు రూ. 30 ల‌క్ష‌ల వ‌ర‌కు అప్పులు ఉన్నాయ‌ని తెలుస్తుంది. దీంతో వెంక‌టేశ్వ‌ర్లు మ‌న‌స్థాపానికి గురి అయి.. పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కుటుంబ స‌భ్యులు అస్ప‌త్రి కి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ వెంక‌టేశ్వ‌ర్లు శుక్ర‌వారం మ‌ర‌ణించాడు.