కామంతో కళ్లుమూసుకుపోయిన ఒక మృగం ఐదేళ్ల పాపపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో చోటు చేసుకుంది. అయితే ఈ దారుణమైన ఘటన నాలుగు ఏళ్ల క్రితం జరిగింది. ఏమీ తెలియని చిన్న వయస్సులో ఈ దారణం జరగడంతో ఆ చిన్న పాప సైలెంట్ గానే ఉంది. అయితే ఇటీవల పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తున్న సమయంలో ఆ పాపకు తనకు ఐదేళ్ల వయస్సులో జరిగిన దారుణం గుర్తుకు వచ్చింది. దీంతో ఈ విషయాన్ని తల్లికి చెప్పింది.
తల్లి వెంటనే అప్రమత్తం అయి.. ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి సోనో గ్రఫీ పరీక్ష చేయించింది. దీంతో అసలు నిజం బయటకు వచ్చింది. దీంతో బాలిక తల్లి జోధ్ పుర్ పోలీసులను ఆశ్రయించి.. జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేసి చిన్నారిపై అఘాత్యానికి పాల్పడ్డ కొరియోగ్రాఫర్ ను అరెస్టు చేశారు.
కాగ నాలుగు ఏళ్ల క్రితం పాఠశాలలో కల్చరల్ ఫెస్ట్ కోసం విద్యార్థులకు డ్యాన్స్ నేర్పించడానికి సనమ్ గిల్ అనే కొరియోగ్రాఫర్ వచ్చాడు. ఈ సమయంలో బాధిత బాలికను టాయిటెట్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బాధిత బాలిక వయస్సు.. ఐదేళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. కాగ నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని పోలీసులు తెలిపారు.