మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష

-

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష రూపాయలు జరిమానా విధించింది సిబిఐ కోర్టు. రుణాల పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకు ను మోసం చేసిన కేసులో గీత భర్త రామకోటేశ్వర రావుకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది సిబిఐ కోర్టు. అలాగే బ్యాంకు అధికారులు బి కే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

విశ్వేశ్వర ఇన్ఫ్రా స్ట్రక్షర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు 52 లక్షల రూపాయలు రుణంగా తీసుకున్నారు. ఈ ఋణం చెల్లించ లేనందున బ్యాంకు అధికారులు గీతా దంపతులపై ఇటీవల ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు అందినా.. వారు డబ్బులు కట్టలేదు. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు గీతను ఇవాళ అరెస్టు చేశారు. కొత్తపల్లి గీతను అరెస్టు చేసి.. బెంగళూరుకు సిబిఐ అధికారులు తరలించారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version