హరియాణాలో దారుణం… నమ్మి రైడ్ కి వెళ్లిన బాలికపై అత్యాచారం

-

నమ్మిన వారే నమవంచనకు పాల్పడుతున్నారు. నమ్మించి అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. కామాన్ని తీర్చుకునేందుకు స్నేహమనే పేరును వాడుకుంటున్నారు. చాలామంది వారికి తెలిసిన వారి చేతిలోనే అఘాయిత్యాలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ సంఘటనే.. హర్యానా రాష్ట్రంలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే… హరియానా గురుగ్రామ్ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ కిరాతకుడు. కారులో బయటకు వెళ్తామని చెప్పి అదే వాహనంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఫరూఖ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్థరాత్రి జరిగింది.

RAPE
RAPE

రాత్రి సమయంలో బాధిత బాలిక ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన సంజయ్ అలియాస్ ఛోటా సదరు బాలికను కిటికీలో నుంచి పిలిచాడు. తన కారులో రైడ్ కు తీసుకెళ్తానని నిద్రలేపి ప్రలోభ పెట్టాడు. అది నమ్మి సదరు బాలిక కారులో సంజయ్ తో బయటకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన సంజయ్ బాలికపై వాహనంలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత గ్రామంలోని పాఠశాల గేటు మందు బాధితురాలిని దింపేసి పారిపోయాడు.

ఈ క్రమంలో బాలిక ఎంతసేపటికి ఇంటిక రాకపోవడంతో తన కూతురు అదృశ్యమైందని ఆమె తల్లి.. పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక కోసం గాలించారు. చివరకు పాఠశాల గేటు వద్ద బాలికను పోలీసులు గుర్తించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వైద్యులు ఇచ్చిన నివేదికతో పోలీసులు కేసును బుక్ చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version