600 మంది అమ్మాయిలతో ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్.. వెలుగులోకి వస్తున్న సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి బాగోతాలు

-

శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ ఖాతాలో ఉన్న 631 మంది ఫ్రెండ్స్ లిస్ట్ లో 600 మందికి పైగా అమ్మాయిలేనట. అంటే.. ఫేస్ బుక్ లో కనిపించిన అమ్మాయికల్లా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం.. వారితో స్నేహం చేయడం చేసేవాడన్నమాట.

హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ కిల్లర్ ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కూడా శ్రీనివాస్ రెడ్డి బాగోతాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా ఒప్పుకున్న శ్రీనివాస్ రెడ్డి… ఫేస్ బుక్ లోనూ అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడట.

శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ ఖాతాలో ఉన్న 631 మంది ఫ్రెండ్స్ లిస్ట్ లో 600 మందికి పైగా అమ్మాయిలేనట. అంటే.. ఫేస్ బుక్ లో కనిపించిన అమ్మాయికల్లా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం.. వారితో స్నేహం చేయడం చేసేవాడన్నమాట.

శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ ఖాతాను పోలీసులు ఓపెన్ చేసి అతడి చాట్ ను పరిశీలించారు. అయితే.. అతడి చాట్ ను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారట. చాట్ లో అమ్మాయిలతో మాట్లాడుతూ.. కలుద్దామని మెసేజ్ పెట్టేవాడట. అమ్మాయిలను లోబర్చుకోవడానికి రకరకాల అస్త్రాలను ప్రయోగించాడట. వాళ్లను మచ్చిక చేసుకోవడానికి ప్రేమగా మాట్లాడేవాడట.

అయితే.. ఫేస్ బుక్ లిస్టులో ఉన్న అమ్మాయిలను శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైనా కలిశాడా? వాళ్లను కలిసి ఏం చేశాడు? వారిని కూడా అత్యాచారం చేసి చంపేశాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంతే కాదు… హాజీపూర్ నుంచి శ్రీనివాస్ రెడ్డి.. తరుచుగా వేములవాడ వెళ్తుండేవాడట. వెళ్లే దారిలో మధ్యలో అమ్మాయిలపై అఘాయిత్యం చేసి చంపేశాడా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దీంతో హాజీపూర్ నుంచి వేముల వాడ మధ్యలో ఉన్న నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో తప్పిపోయిన బాలికలు, యువతుల వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version