నా తండ్రిని నేను ఏనాటికీ క్షమించను: మాధవి

-

కులాంతర వివాహం చేసుకున్నదన్న కోపంతో ఓ తండ్రి తన సొంత కూతురుపై దాడి చేసిన సంగతి తెలిసిందే కదా. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో నడిరోడ్డు మీద మాధవిని నెల క్రితం తండ్రి మనోహరాచారి కత్తితో దాడి చేశాడు. దీంతో మాధవి ఎడమ చేయి, చెవి సగం తెగిపోయాయి. దీంతో మాధవిని వెంటనే సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి మాధవికి ఐసీయూలో చికిత్స అందిస్తూ వచ్చారు. నెల తర్వాత మాధవి పూర్తిగా కోలుకుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం మాధవి మీడియాతో మాట్లాడింది.

నేను తప్పేమీ చేయలేదు. కులాంతర వివాహం చేసుకోవడం తప్పు కాదు కదా. ఈ నెల రోజులు నేను ఎంతో నరకయాతన అనుభవించాను. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన నా తండ్రిని ఏనాటికీ క్షమించను. నాకు యశోద వైద్యులు పునర్జన్మనిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాకు దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అండగా నిలిచారు. నాకోసం నిలిచిన వాళ్లందరికీ రుణపడి ఉంటాను.. అని మాధవి వాపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version