ఈ రైల్వే స్టేషన్‌ను 3 వేల మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు!

-

వెయ్యి కాదు రెండు వేలు అంతకన్నా కాదు.. ఏకంగా 3 వేల మీటర్ల ఎత్తులో ఓ రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నారు తెలుసా మీకు. అది కూడా 26 కిలోమీటర్ల భారీ సొరంగంతో పాటు. ఈ అరుదైన రైల్వే లైన్, రైల్వే స్టేషన్‌కు వేదికయింది హిమాచల్ ప్రదేశ్. భారత్, చైనా సరిహద్దు సమీపంలో ఉన్న బిలాస్‌పూర్-మనాలి-లెహ్ మార్గంలోనే ఈ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి లెహ్ వరకు ప్రయాణ సమయాన్ని తగ్గించడం కోసమే ఈ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

అంతే కాదు.. సరిహద్దుల్లో కాపలా కాసే భద్రతా దళాలు సరిహద్దులను త్వరగా చేరుకోవడం కోసం కూడా ఈ రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నారు. భారీ సొరంగం కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని కెలాంగ్‌లో తొలి స్టేషన్‌ను నిర్మించనున్నారు. అది ఏకంగా 3 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో దేశంలోనే తొలిసారిగా 3 వేల మీటర్ల ఎత్తులో నిర్మించే రైల్వే స్టేషన్‌గా అది చరిత్రకెక్కనుంది. ఇక.. 26 కిలోమీటర్ల భారీ సొరంగంలో 74 టన్నెళ్లు, 124 పెద్ద వంతెనలు, 396 చిన్న వంతెనలను నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఢిల్లీ నుంచి లెహ్ కు కేవలం 20 గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి లెహ్‌కు చేరుకోవడానికి కనీసం 40 గంటలు పడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version