కొడుకు మూత్రం పోశాడని.. తల్లితో యాసిడ్ తాగించారు..!

-

కొడుకు నీటి కాలువలో మూత్రం పోశాడు. దీంతో కోపోద్రికులైన ఇరుగుపొరుగు ఆ పిల్లాడి తల్లితో యాసిడ్ తాగించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని నత్యాసింగ్ నహార్పర్ లో చోటు చేసుకున్నది.

షాహీన్ అనే 35 ఏళ్ల మహిళ నత్యాసింగ్ నహార్పర్ లో ఉంటుంది. ఆమె భర్త సౌదీలో జాబ్ చేస్తుంటాడు. దీంతో ఆ మహిళ తన కొడుకుతో కలిసి అక్కడ ఉంటుంది. ఓరోజు షాహీన్ కొడుకు ఇంటి పక్కన ఉన్న కాలువలో మూత్రం పోశాడు. దాన్ని గమనించిన ఇరుగుపొరుగు ఆమెపై దాడి చేశారు. ఆ మహిళే తన కొడుకుతో మూత్రం పోయించిందని తీవ్రంగా కొట్టారు. అనంతరం ఆ మహిళతో యాసిడ్ తాగించారు. దీంతో తను తీవ్ర అస్వస్తతకు గురయింది. వెంటనే షాహీన్ ను తన బంధువులు ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ వల్ల లోపల అంతా ఇన్ఫెక్షన్ సోకిందని.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version