బాలానగర్‌లో మర్డర్ కలకలం.. మృతుడి తలపై బలమైన గాయం

-

బాలానగర్ పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. జింకల వాడ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అతని తలపైన బలమైన గాయం, రక్తపు మరకలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

వేరే ప్రాంతంలో హత్య చేసి బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను వివరాలు అడిగి సేకరిస్తున్నారు. డెడ్ బాడీ కుడి చేతిపై మామ్ డాడ్ అని ఇంగ్లీష్ అక్షరాలతో టాటూ వేసి ఉంది. మృతుడు 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వాడై ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version