యాదాద్రిలో దారుణం.. రోడ్డు ప్ర‌మాదంలో న‌వవ‌ధువు మృతి

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి అయి నెల రోజులు కూడా నిండ‌ని నవ వ‌ధువు రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించింది. అలాగే ఈ ప్ర‌మాదంలో భ‌ర్త‌కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని బ‌ద్ధతండా కు చెందిన చిట్టి అనే యువ‌తికి ఇటీవల వివాహం జ‌రిగింది. అయితే భ‌ర్తతో చిట్టి ద్విచ‌క్ర వాహ‌నం పై బంధువుల ఇంటికి వెళ్తున్నారు. అయితే యాదాద్రి జిల్లాలోని తుర్క‌ప‌ల్లి మండ‌లం మాదాపూర్ గ్రామం స‌మీపంలో ప్ర‌మాదం జ‌రిగింది.

వీరు ప్ర‌యాణిస్తున్న బైర్ ను ఒక కారు ఢీ కొట్టింది. దీంతో న‌వ వ‌ధువు చిట్టి అక్కడిక‌క్క‌డే మృతి చెందింది. అలాగే భ‌ర్త కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. కాగ స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. అప్ప‌టికే మృతి చెందిన న‌వ వ‌ధువు చిట్టిని భువ‌న‌గిరి ప్ర‌భుత్వ ఏరియా ఆస్ప‌త్రికి పోస్టు మార్టంకు పంపించారు. అలాగే తీవ్రంగా గాయ ప‌డ్డ చిట్టి భ‌ర్త‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అలాగే రోడ్డు ప్ర‌మాదం పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.