సంచలనం; భార్యను రేప్ చేయడానికి, భర్త మీద అక్రమ కేసు పెట్టారు…!

-

అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలోని సిరౌలీ గ్రామం. ఆ గ్రామంలో ఒక అందమైన జంట ఉంది. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి మీద ఆ గ్రామానికి చెందిన నలుగురు యువకులు యువైస్, నాజుక్ బేగ్, రియాసత్ బేగ్, అఫ్జల్ కన్ను పడింది. అయితే ఆమె భర్త పక్కనే ఉండగా అది సాధ్యం కాదని భావించారు ఆ నలుగురు. దీనితో ఆ భర్తను ఎలాగైనా సరే ఏదోకటి చెయ్యాలి అనుకున్నారు.

దొంగతనం ప్లాన్ చేసి ఆమె భర్తను ఆ నేరంలో ఇరికించారు. దీనితో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి మొరాదాబాద్ జిల్లా జైల్లో పెట్టారు. గత శుక్రవారం రాత్రి ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ నలుగురు యువకులు ఎవరూ లేని సమయం చూసుకుని ఆమె ఇంట్లోకి వెళ్ళారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కేశారు. విడతల వారీగా ఆ నలుగురు యువకులు ఆమెను రేప్ చేసారు.

అనంతరం తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను చంపేందుకు కూడా సిద్దమై కత్తితో ఆమె గొంతు కోసారు. కానీ, ప్రాణాలతో బయటపడిన ఆమె గ్రామంలోని ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పడంతో నలుగురు యువకులు గ్రామం నుంచి బయటపడ్డారు. నిందితుల్లో ఒకడైన అఫ్జల్ తన భర్తను ప్లాన్ ప్రకారం దొంగతనం కేసులో ఇరికించి తన మీద ఇలా అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news