వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గొర్రెకుంట గ్రామంలో జరిగిన 9 హత్యలు ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా ఈ హత్యలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగాల్ ప్రజలను కూడా కంగారు పెట్టాయి. వరంగల్ జిల్లా మొత్తం కూడా ఇప్పుడు షేక్ అవుతుంది. అసలు ఆ హత్యలు జరిగిన తర్వాత వేరే రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కనపడితే మాట్లాడాలి అంటే కూడా భయపడుతున్నారు.
ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ కేసులో 60 మత్తు బిళ్ళలు సంచలనంగా మారాయి. వరంగల్ లో వాటిని నిందితుడు కొన్నాడా లేక బెంగాల్ లో కొన్నాడా…? అసలు వాటిని ఏ విధంగా కొనుగోలు చేసాడు…? దేశ వ్యాప్తంగా వాటిని ఇవ్వాలి అంటే కచ్చితంగా డాక్టర్ హామీ ఉండాలి. మూడు షాపుల్లో అతను కొన్నాడు అని పోలీసులు చెప్తున్నారు. సరే పోలీసులు చెప్పినట్టు అతను కొంటె…
ఒక్క వ్యక్తికే 20 బిళ్ళలను ఏ విధంగా ఇచ్చారు…? ఒక్కో షాపులో 20 కొన్నాడని చెప్తున్నారు. అతనికి ఆటో డ్రైవర్ సహాయం చేసాడు అంటున్నారు కాబట్టి అతను ఏమైనా తెచ్చి ఇచ్చాడా…? ఇవన్ని కూడా ఇప్పుడు తెలంగాణా ఔషధ నియంత్రణ మండలి ఆరా తీస్తుంది. మెడికల్ షాపుల యజమానులు దొరికితే మాత్రం వారి పై కఠిన చర్యలను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఎవరు ఇచ్చారు అనేది రెండు మూడు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.