రవిప్రకాశ్, శివాజీ మధ్య సీక్రెట్ మెయిల్స్.. సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద డేటా

-

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, శివాజీ.. ఫోర్జరీ, డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వాళ్లు ప్రస్తుతం విజయవాడలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవాళ ఉదయమే వాళ్లు సైబర్ క్రైమ్ పోలీసులు మెయిల్ కూడా చేసినట్టు తెలుస్తోంది. విచారణకు హాజరు కావడానికి మరో పది రోజుల సమయం కోరినట్లు తెలుస్తోంది.

అయితే.. రవిప్రకాశ్, శివాజీలు ఇద్దరూ ఒకరికి మరొకరు పంపించుకున్న సీక్రెట్ మెయిల్స్ ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద ఉన్నాయట. వాళ్లిద్దరి మధ్య జరిగిన నకిలీ ఒప్పందానికి సంబంధించిన షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఆధారాలన్నింటినీ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారట.

గత నెలలో రవిప్రకాశ్, శివాజీ, మరికొందరి మధ్య మెయిల్స్ ద్వారా సంభాషణలు జరిగాయట. ఆ మెయిల్స్‌ను రవిప్రకాశ్, ఇతరులు డిలీట్ చేసినప్పటికీ.. సైబర్ క్రైం పోలీసులు వాటిని రిట్రీవ్ చేశారట. గత సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఒప్పందం ప్రకారం.. రవిప్రకాశ్.. ఆయన బృందం ఫోర్జరీకి సంబంధించిన పత్రాలను సృష్టించిందట. దానికి సంబంధించిన మెయిల్స్ అన్నీ ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద ఉన్నాయట. ఆ ఆధారాలతో పోలీసులు రవిప్రకాశ్, శివాజీని అరెస్ట్ చేస్తారా? విజయవాడలో రవిప్రకాశ్ ఎక్కడున్నారో కనిపెడతారా? లేదా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version