పిల్లలు పుడతారనే మూఢ నమ్మకం.. బాలిక గుండెను తిన్న నిందితుడు..!

-

స్మార్ట్ టెక్నాలజీతో ఓ పక్క మనిషి పరుగెడుతుంటే మరో పక్క ఆదిమానవుడి లాంటి ఆనవాళ్లు మనకు తారసపడుతూనే ఉన్నాయి. మూఢనమ్మకాలను గుడ్డిగా విశ్వసించి ప్రాణాలమీదకు తెచ్చుకునే వాళ్లు ఉన్నారు. పక్కన వాళ్ల ప్రాణాలు తీసేవాళ్లు లేకపోలేదు. తాజాగా ఉత్తర్‌పద్రేశ్‌లోని భద్రాస్‌లో జరిగిన ఈ ఘటన ఒకప్పటి మనిషి ఎలా ఉండేవాడో తెలియజేస్తుంది. సంతాన యోగం కలుగుతుందన్న మూఢ నమ్మకంతో ఏడేళ్ల బాలకపై పాశవికంగా అత్యాచారం చేసి హత్యచేసి ఆపై అవయువాలు తీశారు. తీసిన ఆ అవయువాలను సంతానం లేని దంపతులు తిన్నారు. వింటుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదూ.. అసలు ఇలాంటి మనుషులు ఉంటారా అనిపిస్తుందా.? సమాజం సిగ్గు పడేలా జరిగిన ఈ ఘటన దీపావళి రోజే చోటు చేసుకుంది.

dead

అత్యంత అమానవీయంగా శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని కత్తితో కోసి బయటికి తీశారు. ఆ అవయవాల్ని తింటే సంతానం కలుగుతుందన్న మూఢ నమ్మకంతో ఉన్న ఓ నిందితుడి మావ, అత్త కలిసి వాటిని తిన్నారు. అవయవాలు తిన్న ప్రధాన నిందితుడు పరశురామ్‌, అతని భార్య సునయనను, బాలికపై అత్యాచారం చేసి దారుణంగా చంపిన అంకుల్‌ (20), బీరమ్‌(31)లను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనలో ప్రధాన నిందితుడు పరుశురామ్ పోలీసులు ఎదుట నేరం అంగీకరించలేదు. కానీ పోలీసులు రకరకాలుగా ప్రశ్నలు వేసి ఉక్కిరిబిక్కిరి చేయటంతో చివరకు పరుశురామ్ నేరాన్ని అంగీకరించాడు. నిందుతుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 1999లో తనకు వివాహం జరిగింది. అప్పటి నుంచి సంతానం లేకపోవటంతో పసిపిల్లల కాలేయం, గుండె తింటే పిల్లలు పుడతారని చదివాడట. అందుకే తన మేనల్లుడు అంకుల్‌కు రూ.500, అతని స్నేహితుడు బీరన్ కు రూ.1000 ఇచ్చి బాలికను చంపడానికి ప్లాన్ చేసుకున్నారు. శనివారం సాయంత్రం టపాసులు కొనిపెడతామని బాలికకు ఆశచూపి.. స్థానిక అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అత్యాచారం చేసి.. చంపేశారు. తర్వాత కత్తితో బాలిక అవయవాలను ఒకొక్కటిగా కోసి బయటికి తీశారు. కాలేయం, గుండెను పరశురామ్‌, ఆమె భార్య సునయనకు అందజేశారు.

నిందితులు వాళ్లకు కావాల్సిన అవయవాలు తీసుకుని మిగిలినవి కుక్కలు విసిరి పారిపోయారు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు వెదకడం ప్రారంభించారు. ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం కాళీ మందిరం సమీపంలో కొందరు గ్రామస్థులకు చెల్లాచెదురుగా పడి ఉన్న బాలిక అవయవాలు కనిపించాయి. దగ్గర్లోని చెట్టు దగ్గర బాలిక చెప్పులు, దుస్తులు పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాలికను హత్య చేయడానికి, అవయవాలను కోయడానికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐపీసీలో వివిధ సెక్షన్ల కింద.. బాలబాలికల లైంగిక వేధింపుల చట్టం (పోస్కో) కింద కేసు నమోదు చేశారు.ఈ దారుణ ఘటన గురించి తెలియగానే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ వెంటనే స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version