జిగిత్యాలలో దారుణం.. టీఆర్ఎస్ నాయకుడిపై క‌త్తి దాడి మృతి

తెలంగాణలోని జిగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ నాయ‌కుడి పై ఒక దుండ‌గుడు విచ‌క్షన రహితంగా దాడి చేశాడు. దీంతో ఆ టీఆర్ఎస్ నాయ‌కుడు మృతి చెందాడు. కాగ ఈ ఘ‌ట‌న జిగిత్యాల జిల్లాలోని మ‌ల్లాపూర్ మండ‌లం రాఘ‌వ‌పేట్ లో చోటు చేసుకుంది. రాఘ‌వ‌పేట్ లో టీఆర్ఎస్ గ్రామ శాఖ‌ అధ్య‌క్షుడిగా ఉన్న మామిడి ల‌క్ష్మ‌య్య (49) అలియాస్ ఎర్ర‌న్న దారుణ హ‌త్య కు గురి అయ్యాడు.

మామిడి ల‌క్ష్మ‌య్య తో అయితే అదే గ్రామంలో ఉంటున్న దాస‌రి వినోద్ కు గ‌త కొద్ది సంవ‌త్స‌రాల నుంచి కల‌హాలు ఉన్నాయి. తాజా గా వీరి మ‌ధ్య పాత కక్ష‌లు బ‌య‌ట ప‌డ‌టంతో ఇద్ద‌రి మ‌ధ్య ఉదృక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో దాస‌రి వినోద్ వ‌ద్ద ఉండే ప‌నిమొట్టు తో మామిడి ల‌క్ష్మ‌య్య పై విచ‌క్ష‌న రహితంగా దాడు చేశాడు. దీంతో ల‌క్ష్మ‌య్య కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు ల‌క్ష్మ‌య్య ను ఆస్పత్రికి త‌ర‌లిస్తున్న క్ర‌మంలో మార్గ మ‌ధ్య‌లోనే మృతి చెందాడు.