కోహ్లీ ఓవరాక్షన్… ఓ జూనియర్ ప్లేయర్ ను ర్యాగింగ్ చేస్తూ !

-

IPL 2025లో భాగంగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కాస్త ఓవర్ గా బిహేవ్ చేసాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ప్లేయర్‌ నేహాల్ వధేరాను ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా ర్యాగింగ్ చేశాడు. పంజాబ్ కింగ్స్ సరిగ్గా 76 పరుగులు ఉన్న సమయంలో నేహాల్ వధేరా.. రన్ అవుట్ అయ్యాడు. దీంతో వధేరాను చూస్తూ కోహ్లీ అసభ్యకర ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆట పట్టించాడు. గత మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ విజయం సాధించడంలో వధేరా కీలక పాత్ర పోషించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Kohli glares at Nehal Wadhera after inflicting run out, strikes fierce send-off pose during PBKS vs RCB

కాగా ఈ మ్యాచ్ లో RCB ఘన విజయం సాధించింది. IPL 2025లో భాగంగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేయగా.. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. కోహ్లీ, పడిక్కల్ పరుగులతో బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news