YS Vivekananda Reddy Murder: ఇంటి గుట్టుపై నోరు విప్పిన పరమేశ్వర్ రెడ్డి

-

ఇంట్లో వాళ్ల ఇన్వాల్వ్ మెంట్ లేనిదే వైఎస్ వివేకా హత్య జరగదని ఆయన ఆరోపించారు. వివేకానందరెడ్డిని రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలని… ఈ హత్య చేసినట్టుగా ఆయన అనుమానిస్తున్నట్టు తెలిపారు.

వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు. ఆయన హత్య మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన ముందు గుండెపోటుతో మరణించారని వార్తలు వచ్చాయి. తర్వాత హత్య అన్నారు. ఆయన శరీరంపై గొడ్డలితో నరికినట్టుగా గాయాలు ఉండగా.. గుండెపోటుతో ఆయన మరణించారని ఎలా చెప్పారన్న సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అది హత్యే అని తేలేంతవరకు అంతా ఆయన గుండెపోటుతోనే మృతి చెందాడని అందరూ అనుకున్నారు. కానీ.. పోస్ట్ మార్టం రిపోర్టులో అది సహజ మరణం కాదు.. హత్య అని తేలాక.. ఆయన హత్య ఓ మిస్టరీగా మారింది.

Vivekananda Reddy friend parameswar reddy talks on his murder

అయితే.. ఆయన హత్యపై ఆయన సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హత్య ఇంటి దొంగల పనేనంటూ ఆరోపించారు. దీంతో పరమేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. తాను వైఎస్ వివేకానంద రెడ్డి కోసం ప్రాణం ఇచ్చేవాడినే కానీ.. ప్రాణం తీసేవాడిని కాదు.. అంటూ ఆయన తెలిపారు.



ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇంట్లో వాళ్ల ఇన్వాల్వ్ మెంట్ లేనిదే వైఎస్ వివేకా హత్య జరగదని ఆయన ఆరోపించారు. వివేకానందరెడ్డిని రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలని… ఈ హత్య చేసినట్టుగా ఆయన అనుమానిస్తున్నట్టు తెలిపారు.

జగన్ సీఎం అయితే.. వివేకానంద రెడ్డి కూడా రాజకీయంగా మరింత బలపడేవారన్నారు. వైఎస్ విజయమ్మ కానీ షర్మిల కానీ కడప ఎంపీగా పోటీ చేయాలనే ప్రతిపాదనను కొందరు ఒప్పుకోలేదని వివేకా తనకు చెప్పనట్లు పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. వివేకాను కడప ఎంపీగా పోటీ చేయాలని వైఎస్ షర్మిల తనను కోరిందని వివేకా తనకు చెప్పినట్లుగా పరమేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. అయితే.. కడ ఎంపీగా షర్మిల కానీ.. విజయమ్మ కానీ పోటీ చేస్తే బెటర్ అని వివేకా తనతో చెప్పినట్టు గుర్తు చేశారు. జగన్ సీఎం అయితే మాత్రం తనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని వివేకా తనకు చెప్పినట్లుగా పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.

కొన ఊపిరితో ఉన్నప్పుడే వివేకాతో లేఖ రాయించి ఉండొచ్చని ఆయన అనుమానిస్తున్నారు. డ్రైవర్ ప్రసాద్ మంచివాడని ఆయన అన్నారు. వివేకా హత్య ఆవేశంలో జరిగింది కాదని.. పక్క ప్లాన్ ప్రకారం జరిగిందని ఆయన తెలిపారు. ఇంటి తలుపులు పగులగొడితే.. ఆ శబ్దానికి వివేకా ఎవరికైనా ఫోన్ చేస్తాడేమోనన్న భయంతో ముందే ఇంటి వెనుక తలుపులు తెరిచి పెట్టారని ఆయన వెల్లడించారు. వివేకా దగ్గర ఉండే పీఏ, గంగిరెడ్డిని ఎవరినీ కూడా తాను నమ్మనని పరమేశ్వర్ రరెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news