జ‌న‌సేన రెండో జాబితా విడుద‌ల‌.. లిస్ట్‌లో సికింద్రాబాద్ లోక్‌స‌భ స్థానం..

-

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు నామినేషన్లు ఇవాళ ప్రారంభం కాగా.. ఇప్ప‌టికే ప‌లు పార్టీలు త‌మ త‌మ అభ్య‌ర్థుల జాబితాల‌ను విడుద‌ల చేశాయి. ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఒకేసారి 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి అధికార టీడీపీకి షాక్ ఇచ్చింది. అయితే మ‌రోవైపు టీడీపీలో సీట్ల కేటాయింపు ఇంకా కొలిక్కి రాదు. దీంతో ఆ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు 140 స్థానాల‌కు రెండు విడ‌త‌ల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ పార్టీ త‌ర‌ఫున ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోయే 32 మంది అభ్య‌ర్థులతో తొలి జాబితాను ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే వెంట‌నే మ‌రో జాబితాను కూడా ఆయ‌న విడుద‌ల చేశారు. రెండో జాబితాలోనూ 32 మంది అసెంబ్లీ అభ్య‌ర్థుల పేర్ల‌ను ఇచ్చారు.



అలాగే తెలంగాణ‌లో ఒక లోక్‌స‌భ స్థానంతోపాటు ఏపీలో 5 లోక్‌స‌భ స్థానాల్లో నిల‌బ‌డే అభ్య‌ర్థుల జాబితాను కూడా విడుద‌ల చేశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన 64 అసెంబ్లీ, ఏపీలోని 7, తెలంగాణ‌లోని రెండు లోక్‌స‌భ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన‌ట్లు అయింది. ఇక సీపీఎం, సీపీఐలు 14 అసెంబ్లీ స్థానాల్లో, బీఎస్పీ 21 స్థానాల్లో పోటీ చేయ‌నుండ‌గా, జ‌న‌సేన 140 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయ‌నుంది.

లోక్‌సభ అభ్యర్థులు

అరకు- పంగి రాజారావు
మచిలీపట్నం- బండ్రెడ్డి రాము
రాజంపేట- సయ్యద్‌ ముకరం చాంద్‌
శ్రీకాకుళం – మెట్ట రామారావు (ఐఆర్‌ఎస్‌)
సికింద్రాబాద్‌ – నేమూరి శంకర్‌ గౌడ్‌ (తెలంగాణ)

శాసనసభ అభ్యర్థులు

శ్రీకాకుళం జిల్లా

1. ఇచ్ఛాపురం – దాసరి రాజు
2. పాతపట్నం – గేదెల చైతన్య
3. ఆముదాలవలస – రామ్మోహన్‌

విశాఖపట్నం జిల్లా

1. మాడుగుల -జి.సన్యాసినాయుడు
2. పెందుర్తి – చింతలపూడి వెంకటరామయ్య
3. చోడవరం – పీవీఎస్‌ఎన్‌.రాజు
3. అనకాపల్లి – పరుచూరి భాస్కరరావు

తూర్పుగోదావరి జిల్లా

1. కాకినాడ రూరల్‌ – పంతం నానాజీ
2. రాజానగరం – రాయపురెడ్డి ప్రసాద్‌ (చిన్నా)
3. రాజమండ్రి అర్బన్‌ – అత్తి సత్యనారాయణ

పశ్చిమ గోదావరి జిల్లా

1. దెందులూరు – ఘంటసాల వెంకట లక్ష్మి
2. నర్సాపురం – బొమ్మడి నాయకర్‌
3. నిడదవోలు – అటికల రమ్యశ్రీ
4. తణుకు – పసుపులేటి రామారావు
5. ఆచంట – జవ్వాది వెంకట విజయరామ్‌
6. చింతలపూడి – మేకల ఈశ్వరయ్య

కృష్ణా జిల్లా

1. అవనిగడ్డ – ముత్తంశెట్టి కృష్ణారావు
2. పెడన – అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌
3. కైకలూరు – బీవీ.రావు
4. విజయవాడ పశ్చిమ-పోతిన వెంకట మహేష్‌
5. విజయవాడ తూర్పు – బత్తిన రాము

ప్రకాశం జిల్లా

1. గిద్దలూరు -షేక్‌ రియాజ్‌
2. దర్శి – బొటుకు రమేష్‌

నెల్లూరు జిల్లా

కోవూరు – టి.రాఘవయ్య

అనంతపురం జిల్లా

అనంతపురం అర్బన్‌ -డాక్టర్‌ కె.రాజగోపాల్‌

కడప జిల్లా

1. కడప -సుంకర శ్రీనివాస్‌
2. రాయచోటి – ఎస్‌కే.హసన్‌ బాషా

కర్నూలు జిల్లా

1. ఎమ్మిగనూరు- రేఖా గౌడ్‌
2. పాణ్యం – చింతా సురేష్‌
3. నందికొట్కూరు – అన్నపురెడ్డి బాల వెంకట్‌

చిత్తూరు జిల్లా

1. తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్‌రెడ్డి
2. పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్‌

Read more RELATED
Recommended to you

Latest news