డేటింగ్ చేస్తే అలాంటి వ్యక్తితోనే.. ఐ హేట్ వన్ లైఫ్ వన్ లవ్ : నిహారిక కొణిదెల

-

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక తనకు తగిన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం సూర్యకాంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిహారిక ఈ సినిమా ప్రమోషన్స్ లో తన వ్యక్తిగత విషయాలను వెళ్లడించింది.

60 సెకండ్స్ విత్ సూర్యకాంతం అంటూ ఓ ప్రమోషన్ వీడియో రిలీజ్ చేశారు. వీటిలో నిహారిక పర్సనల్ ఫీలింగ్స్ ను షేర్ చేసుకుంది.మీకు వరస్ట్ అనిపించే హ్యాష్ ట్యాగ్ ఏంటని అడిగితే దానికి సమాధానంగా వన్ లైఫ్ వన్ లవ్ అని సమాధానం ఇచ్చింది.



ఒకవేళ మీరు డిజే పెడితే దాని పేరు ఎలా ఉండొచ్చు అంటే డిజే కిలా అని పెడుతుందట. ఎలాంటి వ్యక్తితో మీరు డేటింగ్ చేస్తారు అంటే.. బాగా మాట్లాడే తనని ఓపికగా తన మాటలను వింటూ భరించే వాడితో డేటింగ్ కు వెళ్తా అన్నది నిహారిక. ఇక స్నానం చేయకుండా 2 రోజులు ఉంటారా అంటే అవ్నని చెప్పి షాక్ ఇచ్చింది మెగా డాటర్. ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక సూర్యకాంతంతో అయినా హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news