కొండా సురేఖ ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి – నాగార్జున సంచలనం

-

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఇటీవలే నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు నిన్న విచారణ చేపట్టి ఇవాళ నాగార్జున హాజరు కావాలని పేర్కొంది. దీంతో తాజాగా నాగార్జున, అమల, నాగ చైతన్య నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. అక్కినేని నాగార్జునతో పాటు విట్ నెస్ సుప్రియ, వెంకటేశ్వర్లు ల స్టేట్మెంట్ ను రికార్డు చేసింది నాంపల్లి కోర్టు.

నటుడు నాగచైతన్య-సమంత విడాకులకు కారణం కేటీఆర్ అని.. నాగార్జున N కన్వెన్షన్ హాల్ విషయంలో కూల్చకుండా ఉండేందుకు కీలక ఒప్పందం కుర్చుకున్నారని.. చెప్పరాని విషయాలను మీడియాతో చెప్పింది.  ఆ తరువాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని.. హీరోయిన్ సమంతకు కూడా సారీ చెప్పింది. ఈ నేపథ్యంలోనే నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తాజాగా విచారణ చేపడుతోంది కోర్టు. నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేస్తుంది కోర్టు. ” సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయి.. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి.. సినిమా రంగం తో పాటు సామజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నాం.. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వల్ల అంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారు.. అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది.. మంత్రి కొండా సురేఖ ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి” అని కోర్టులో పేర్కొన్నారు నాగార్జున

Read more RELATED
Recommended to you

Latest news