స్టార్ సెల‌బ్రిటీ రేప్ కేసు సెటిల్మెంట్‌.. రూ. 2.75 కోట్ల డీల్‌..!

-

సెల‌బ్రిటీల విష‌యాలు ఎంత ర‌చ్చ ర‌చ్చ చేసేవి అయినా సైలెంట్‌గా సెటిల్మెంట్ అయిపోతుంటాయి. పోర్చుగ‌ల్ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై వచ్చిన అత్యాచారం అభియోగం కొద్ది యేళ్ల క్రితం సాక‌ర్ ప్ర‌పంచంలో ప్ర‌కంప‌న‌లు రేపింది. రోనాల్డో అభిమానులు కూడా అత‌డిని అనుమానించే వ‌ర‌కు విష‌యం వెళ్లింది. ఇక ఇప్పుడు ఈ అత్యాచారం అభియోగం స‌రికొత్త మ‌లుపు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Cristiano Ronaldo Admits Paying $375,000 Hush Money To A Woman Who Accused Him Of Rape

కొన్నేళ్ల‌ క్రితం అమెరికాకు చెందిన ఒక మోడ‌ల్ రోనాల్డో త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని ఆరోపించింది. అది కూడా ప‌దేళ్ల క్రితం త‌న‌ను రొనాల్డో అత్యాచారం చేశాడ‌ని చెప్ప‌డంతో అంద‌రూ షాక్ తిన్నారు. ఈ మేరకు ఆ మోడ‌ల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ సాగుతూ ఉంది. అమెరికాకు చెందిన మయోర్గా అనే ఆ మోడల్‌కు రొనాల్డో అప్ప‌ట్లోనే భారీగా డ‌బ్బులు ఇచ్చి ఈ వ్య‌వహారం బ‌య‌ట‌కు రాకుండా సెటిల్ చేసుకున్నాడ‌న్న టాక్ వ‌చ్చింది.

అయితే దీనిని ఇప్ప‌టి వ‌రకు రొనాల్డో ఖండిస్తూ వ‌చ్చాడు. తాజాగా రొనాల్డో లాయర్లు ఆ విషయాన్నే ధ్రువీకరించారు. ఇండియ‌న్ క‌రెన్సీలో చెప్పాలంటే రూ 2.75 కోట్ల‌ను చెల్లించి రొనాల్డో ఆమెతో ఈ వ్య‌వ‌హారాన్ని సెటిల్ చేసుకున్న‌ట్టు ఇప్పుడు వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని రొనాల్డో లాయ‌ర్లు ధృవీక‌రించారు.

అంత భారీ మెత్తం ఆమెకు ముట్ట‌చెప్పినా ఆమె మాత్రం ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంద‌ని వారు కోర్టుకు ఇచ్చిన నివేదిక‌లో పేర్కొన్నారు. ఏదేమైనా ప‌దేళ్ల నాటి కేసు ఇంకా రొనాల్డోను ముప్పుతిప్పులు పెడుతూనే ఉంది. మ‌రి దీని నుంచి రొనాల్డో ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version