మోడీ మామా : సొంత స్నేహితుడి నుంచి విమ‌ర్శ‌లా ?

-

బీజేపీకీ, శివ‌సేన‌కూ ఎప్పుడో చెడింది. చెడిన వాటి గురించి పెద్ద‌గా మాట్లాడ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్ అని బీజేపీ అనుకుంటోంది. అందుకే శివ‌సేన పార్టీతో కేసీఆర్ దోస్తీ చేస్తానంటున్నారు. ముంబ‌యి దారుల్లో కేసీఆర్ తో శివ‌సేన ప్ర‌యాణం ఎలా ఉంటుంది అన్న‌ది ఊహించుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే అయినా ! ఇరు వర్గాలూ అనుకుంటే సాధ్య‌మే ! ఇక రేట్లు విష‌య‌మై ఒక‌టికి రెండు సార్లు తెలంగాణ రాష్ట్ర స‌మితి మాదిరిగానే శివ‌సేన కూడా తిడుతోంది బీజేపీని! ఆ విధంగా చూసుకుంటే భావ సారూప్య‌త వ‌చ్చింది.

శివ‌సేన‌తో పాటు ఇవాళ సీన్ లోకి కాంగ్రెస్ కూడా వ‌చ్చి తిడుతోంది. రేట్ల విష‌యంతో పాటు దేవేంద్ర ఫ‌డ్న‌వీసు భార్య డ్రెస్ సెన్స్ పైనా తిడుతోంది. అంటే ఆమె మోడ్ర‌న్ డ్రెస్ లో వెలిగిపోతోంది. తెల్లారితే చాలు సంస్కృతీ సంప్ర‌దాయం పేరిట లెక్చ‌ర్లు దంచి కొట్టే బీజేపీకి ఇవి క‌నిపించ‌డం లేదా అని కూడాఅంటోంది.

అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, శివ‌సేన క‌లిస్తే బీజేపీ ప‌డ‌వ‌ను ముంచ‌డం ఖాయం అని తెలుస్తోంది. అంటే.. మోడీకి శివ‌సేన పెద్ద‌ల‌కూ ఉన్న వైరం ఓ అవ‌కాశంగా మ‌రో రెండు పార్టీల‌కు మార‌నుంది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి జాతీయ రాజ‌కీయాల్లో రాణించాలంటే మ‌రోసారి ఫ‌డ్నవీసుకు వ్య‌తిరేకంగా ఉద్ధవ్ ఠాక్రేకు ద‌గ్గ‌ర‌గా మాట్లాడాల్సి ఉంది. ఇక పెట్రో రేట్ల‌పై కూడా ఉద్ధ‌వ్ సీరియ‌స్ అయ్యారు. ఓ విధంగా ఈ క‌రెంట్ కంటెంట్ ను సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కూ న‌డ‌ప‌డం క‌ష్టమే కానీ కొన్ని ఎత్తుగ‌డ‌ల‌ను నిలువరిస్తే ప్ర‌జ‌ల‌ను త‌మవైపు తిప్పుకోవ‌డం ఏమంత క‌ష్టం కాద‌న్న‌ది శివ‌సేన యోచ‌న కావొచ్చు.

ఆ విధంగా శివ‌సేన పెద్దాయ‌న మోడీ పై విరుచుకుప‌డ్డారు. పెంచింది ఎక్కువ. త‌గ్గించింది త‌క్కువ అంటూ ఉద్ధ‌వ్ మండిప‌డుతున్నారు. ఒక్క‌సారి ఆయ‌నేమ‌న్నారో చూద్దాం..కేంద్రం రెండు నెలల కింద‌ట ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ పై 18 రూపాయ‌ల 42 పైస‌లు పెంచింది. ఎనిమిది రూపాయ‌లు త‌గ్గించింది.డీజిల్ పై 18 రూపాయ‌ల 24 పైస‌లు పెంచింది.. ఆరు రూపాయ‌లు త‌గ్గించింది. అంటూ మండిప‌డుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version