నివర్ తుఫాను క్రమంగా బలహీనపడి ప్రస్తుతం వాయుగుండంగా, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇది రాబోయే ఆరు గంటల్లో క్రమంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో చిత్తూరు నెల్లూరు కడప ప్రకాశం కర్నూలు జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడతాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే కృష్ణా గుంటూరు జిల్లాలో నివార్ తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది.
అన్నదాత కన్నీటి సంద్రంలో ముని పోయారు. నివార్ తుఫాన్ ప్రభావంతో రైతాంగం కుదేలయ్యింది. 25 వేల హెక్టార్లలో వరి పంట నేలకొరిగింది. పనలపై ఉన్న మరో 20 వేల హెక్టార్ల పంట కూడా దెబ్బతిన్నది. కోసిన వరి పంటపై వర్షపునీరు చేరడంతో ఒక్క రోజు వ్యవధిలోనే రంగు మారే అవకాశం తో పాటు మొలకలు వస్తాయి అని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పంట నష్టం బాగా వచ్చింది. 14 ఎకరాల వరి పొలం పంట చేతికి వచ్చింది.. తుఫాను గాలి వల్ల అదంతా ఒరిగిపోయింది. చేతికి అందిన పంట ఇలా పడిపోవడంతో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.