బోధన్ ఫేక్ పాస్ పోర్ట్ కేసులో కీలక అరెస్ట్ లు !

-

బోధన్ ఫేక్ పాస్ పోర్ట్ స్కాంలో కీలక అరెస్టులు చేశారు పోలీసులు. ఈ స్కామ్ లో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు పోలీసు అధికారులతో పాటు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. అరెస్టయిన వారిలో నలుగురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. తప్పుడు పత్రాలతో ఒక ముఠా 32 పాస్ పోర్ట్ లు తీసుకున్నట్లు గుర్తించారు.

ఇవి కాక ఒకే ఇంటి అడ్రస్ మీద దాదాపుగా 70 కి పైగా పాస్ పోర్ట్ లు జారీ అయినట్లు విచారణలో తేలింది. ఇక శంషాబాద్ పాస్ పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ఈ ముఠాప్రయత్నించడంతో అక్కడ పోలీసులకు చిక్కారు. అక్కడ అధికారులు పాస్ పోర్ట్ లు సీజ్ చేసి విచారించడంతో ఈ బోధన్ లింక్ బయట పడింది.  ఈ పాస్పోర్ట్ స్కామ్ మీద ఇప్పటికే స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసిన పోలీసులు, పాస్ పోర్ట్ ల జారీలో పోలీసుల పాత్ర మీద కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version