బోరబండ భూ ప్రకంపనలు, వర్షాల వల్లే.. భయపడకండి !

-

రహమత్ నగర్, బోరబండ ప్రాంతాల్లో వస్తున్న భూకంపాలు సహజమైనవేనని ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ శ్రీనగేష్పేర్కొన్నారు. దీని వల్ల పెద్దగా ప్రమాదాలు జరగవన్న ఆయన ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు లేవని అన్నారు. రిక్టర్ స్కేల్ పై 1.4 నమోదయింది. భూమి పొరల్లో నీరు చేరుతున్న సమయంలో ఇలాంటి శబ్దాలు వస్తుంటాయని అన్నారు. పై పొరల్లో నీరు చేరుతున్న సమయంలో ఈ శబ్దాలు వస్తాయని, లోతుల్లో జరిగితే శబ్దాలు వచ్చేవి కావని అన్నారు.

నగరంలో గతంలో జూబ్లీహిల్స్, వనస్థలిపురం, రహమత్ నగర్, బోరబండ, గండి పేట ప్రాంతాల్లో వచ్చాయన్న ఆయన రెండోసారి మాత్రం బోరబండ ప్రాంతంలోనే వచ్చాయని అన్నారు. 2017 తర్వాత ఇది రెండోసారని ఆయన అన్నారు. బోరబండ లో మూడు ప్రాంతాల్లో అబ్జర్వేషన్ చేస్తున్నామని, గతంలో వచ్చిన స్థలంలోనే మళ్లీ రిపీట్ అయ్యాయా, కొత్త ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయా అనే కోణంలో పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలు భయపడాల్సినంత తీవ్రత ఈ ప్రకంపనలకు లేదని అన్నారు. సోషల్ మీడియా లో వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. దక్షిణ భారత దేశంలో భూకంపాలు వచ్చే అవకాశాలు తక్కువని, అధిక వర్షాలు, వర్షపాతం నమోదు కావడం వల్లే ప్రకంపనలు వస్తున్నాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version