కొందరు యువకులు సరదా కోసం నీటిలో దిగి తన ప్రాణాలను కోల్పోయారు. అంతా చూస్తుండగానే వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్‌లోని హల్దార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
ముగ్గురు యువకులు జాలు వారే అలుగు వద్ద నీటిలో ఈత కొట్టేందుకు అందులోకి దూకారు. సరదాగా ఈత కొడుతున్న తరుణంలో నీటి ప్రవాహం పెరిగిపోయి అలుగు మీద నుంచి కిందకు జారిపోయారు.భారీ నీటి ప్రవాహానికి తోటి యువకులు చూస్తుండగానే కొట్టుకెళ్లి పోయారు.ఈ క్రమంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయట పడినట్లు సమాచారం. కాగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.