జగిత్యాలలో భారీ క్రీప్టో మోసం..!

-

జగిత్యాల జిల్లాలోక్రిప్టో కరెన్సీ మోసం వెలుగు చూసింది. మెటాఫండ్ అనే క్రిప్టో కంపెనీలో లాభాల ఆశ చూపి తమను మోసం చేశాడంటూ కొడిమ్యాల కు చెందిన బాధితులు మోసం కస్తూరి రాకేష్ అనే వ్యక్తిని నిలదీస్తున్నారు. రాకేష్ మాయమాటలు నమ్మి తాము ఏడు లక్షల పెట్టుబడి పెట్టడంతో పాటు మరికొందరితో 70 లక్షలు పెట్టుబడి పెట్టించినట్లు బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత డబ్బులు రాకపోవడంతో 8 నెలలుగా రాకేష్ చుట్టూ తిరుగుతున్నట్లుగా బదితురాలు ఆరోపిస్తుంది. చేసేదేం లేక జగిత్యాలలోని రాకేష్ ఇంటి అడ్రస్ కనుక్కొని వెళ్లి డబ్బులు ఇవ్వాల్సిందిగా నిలదీసింది.

అయితే సమయానికి రాకేష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఏదైనా సమస్య ఉంటే కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా బాధితులకు సూచించారు. బాధితులను పట్టణంలోని హోటల్ తీసుకువెళ్లిన రాకేష్.. కొంత సమయం ఇస్తే డబ్బులు తిరిగి ఇస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు కంప్లైంట్ చేయకుండానే వెళ్లారు. డబ్బులు అడిగిన ప్రతిసారి తనకు జిల్లా స్థాయి పోలీస్ ఆఫీసర్లు తెలుసని మాయమాటలు చెబుతూ తప్పించుకుని తిరుగుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version