క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ప్రారంభమైంది. ఈ రోజు తొలి మ్యా్‌చ్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. అయితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చెన్నై బ్యాటర్లలో రుత్‌రాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్.. 9 సిక్స్‌లు, 4 ఫోర్లతో 92 పరుగులు చేశాడు.
ఆఖరిలో కెప్టెన్ ధోని(7 బంతుల్లో 14 పరుగులు) రాణించాడు. గుజరాత్ బ్యాటర్లలో మహ్మద్ షమీ,రషీద్ ఖాన్, జోషఫ్ తలా రెండు వికెట్లు సాధించారు. వరుస క్రమంలో జడేజా, దుబే వికెట్లను సీఎస్‌కే కోల్పోయింది. 92 పరుగులు చేసిన రుత్‌రాజ్ గైక్వాడ్.. జోషఫ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దూకుడుగా ఆడుతున్న రుత్‌రాజ్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి.