బ్రేవో, జడేజాలని పక్కన పెట్టి జాదవ్ ఎందుకు పంపించామంటే..సీఎస్కే కోచ్..

0
153

బుధవారం జరిగిన కోల్ కతా నైట్ రడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులో కోల్ కతా నైట్ రైడర్స్ 10పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో చెన్నై బ్యాట్స్ మెన్ కేదార్ జాదవ్ పై విమర్శలు వస్తున్నాయి. 168పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, లక్ష్యాన్ని అందుకోవడంలో చతికిల పడింది. నిజానికి కేదార్ జాదవ్ సరిగ్గా ఆడితే మ్యాచ్ చెన్నై చేతికి వచ్చేది. ధోనీ ఔటయ్యాక బ్యాటింగ్ కి దిగిన జాదవ్, 12బంతులాడి ఏడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. నిజానికి ఆ టైమ్ లో జడేజా కానీ బ్రేవో కానీ ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ వారిద్దరి కంటే ముందుగా కేదార్ జాదవ్ బ్యాటింగ్ కి దిగాడు.

ఐతే ఈ విషయమై చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వివరణ ఇచ్చాడు. ధోనీ ఔటయ్యాక కేదార్ జాదవ్ ని దింపడానికి కారణం అతడు స్పిన్ బౌలింగ్ ని బాగా ఎదుర్కోగలడనే. కానీ దురదృష్టవశాత్తు అతడు సరిగ్గా ఆడలేదు. ఫలితం చెన్నై సూపర్ కింగ్స్ 10పరుగుల తేడాతో ఓడిపోయింది. జాదవ్ తర్వాత బ్యాటింగ్ కి దిగిన జడేజా 8బంతుల్లో ఒక ఫోరు, ఒక సిక్సర్ తో 21పరుగులు చేసాడు. ఐతే కేదార్ జాదవ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.