ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 6.60 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం 30వేల మందికి పైగా చనిపోయారు. దీంతో అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. అయితే కరోనాకు ఇప్పటి వరకు ఇంకా వ్యాక్సిన్‌ను మాత్రం సైంటిస్టులు తయారు చేయలేదు. కానీ క్యూబాలో కరోనా వ్యాక్సిన్ ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఆ వ్యాక్సిన్ ఇప్పుడు తయారైంది కాదు.. 1986లోనే క్యూబా తయారు చేసింది. ఇప్పుడదే వ్యాక్సిన్ కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.
Interferon Alfa-2B… క్యూబా తయారు చేసిన ఆ వ్యాక్సిన్ ఇదే. మానవ శరీరంలో చేరే సూక్ష్మ క్రిములకు వ్యతిరేకంగా పోరాడే యాంటీ బాడీలను పోలిన కణాలతో ఈ వ్యాక్సిన్‌ను క్యూబా 1986లోనే తయారు చేసింది. అప్పటి నుంచి ఈ వ్యాక్సిన్‌ను హెచ్ఐవీ, హ్యూమన్ పాపిలోమా వైరస్, హెపటైటిస్ బి అండ్ సి వ్యాధులకు ఉపయోగిస్తున్నారు. కానీ తాజాగా ఈ వ్యాక్సిన్‌ను కరోనాపై ప్రయోగించారు. ఈ క్రమంలో ఈ వ్యాక్సిన్ కరోనాపై సమర్థవంతంగా పనిచేసిందని వెల్లడైంది. అయితే సహజంగానే క్యూబా చైనాకు మిత్ర దేశం కనుక ఆ దేశం చైనాకు ఆ వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున పంపించిందని, అలాగే చైనాలోనే స్థానిక ఫార్మా కంపెనీల సహాయంతో సదరు ఆల్ఫా-2బి వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసిందని, ఈ క్రమంలో చైనా ఆ వ్యాక్సిన్‌తోనే అక్కడి కరోనా రోగులకు పెద్ద ఎత్తున తక్కువ కాలంలోనే చికిత్స అందించి, అందరికీ వ్యాధి నయం చేసిందని.. వార్తలు వస్తున్నాయి. చైనాకు చెందిన పలు మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని ప్రచారం చేస్తున్నాయని సమాచారం.
కాగా క్యూబా వద్ద అందుబాటులో ఉన్న సదరు ఆల్ఫా-2బిని ఇప్పుడు ప్రపంచమంతా వండర్ డ్రగ్‌లా భావిస్తోంది. ఈ వ్యాక్సిన్ కరోనాపై పనిచేస్తుండడంతో క్యూబా ఈ మందును అన్ని దేశాలకు అందించాలని చూస్తోంది. అందులో భాగంగానే క్యూబాకు చెందిన నిపుణులైన వైద్యులతోపాటు సదరు వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఇటలీకి కూడా పంపించారు. ఇక మన దేశంలో కేరళ ప్రభుత్వం ఇప్పటికే క్యూబాను సంప్రదించింది. దీంతో వారు కేరళకు మెడిసిన్‌ను అందించేందుకు అంగీకరించారు. కాగా.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. డ్రగ్ కంట్రోల్ బోర్డు అనుమతి లభిస్తే గానీ.. కేరళకు ఆ వ్యాక్సిన్ రాదు. ఈ విషయంపై ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్రాన్ని కోరారు. ఆ విషయాన్ని ఆయన మూడు రోజుల క్రితం స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్రం అనుమతి లభించాక.. Interferon Alfa-2B డ్రగ్ కేరళకు వస్తుంది. అప్పుడు కరోనా రోగులకు చికిత్స అందించడం వేగవంతమవుతుంది.
అయితే ఈ డ్రగ్ గురించి గత వారం రోజులుగా పలు అంతర్జాతీయ వెబ్‌సైట్లు, మీడియాలో కథనాలు వస్తున్నా.. మన దేశంలో మీడియా దీని గురించి పట్టించుకోకపోవడం బాధాకరం.. నిజానికి క్యూబా చిన్న దేశమే అయినా.. వారు వైద్య రంగంలో చేస్తున్న ఆవిష్కరణలు అద్భుతమనే చెప్పవచ్చు. అమెరికా వంటి అగ్రరాజ్యంలో లేని నిపుణులైన వైద్యులు అక్కడ ఉన్నారు. అందుకనే అక్కడ ఎప్పుడో ఆ వండర్ డ్రగ్‌ను తయారు చేశారు. అయితే దీనిపై మన దేశం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎన్నో దేశాలు తిరిగి వారితో స్నేహ సంబంధాలు పెంచుతున్న ప్రధాని మోదీ క్యూబాతోనూ మన సంబంధాలను మెరుగు పరిచారు. ఆయన స్వయంగా అడిగితే వారు కాదంటారా..? అనరు కదా.. కనుక ప్రధాని మోదీ ఈ విషయంపై వీలైనంత త్వరగా స్పందించి ఆ డ్రగ్‌ను భారత్‌కు రప్పించే ఏర్పాటు చేస్తే.. కోట్ల మంది జనాలు కాస్త రిలీఫ్ ఫీలవుతారు.. మరి ప్రధాని మోదీ ఈ విషయంపై ఏం చేస్తారో చూడాలి..!