తెలంగాణలో కర్ఫ్యూ కౌంట్ డౌన్ మొదలైనట్లేనా ?

-

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య ఉన్నట్టుండి అమాంతగా పెరిగిపోతోంది. ఆస్పత్రులన్ని కరోనా రోగులతో నిండిపోతున్నాయ్. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రం కూడా మరో ఆలోచన చేస్తుందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే మహరాష్ట్ర,ఢిల్లీ, రాజస్థాన్‌, పంజాబ్‌,గుజరాత్ లో పరిస్థితి చేదాటిపోయింది. వీకెండ్ ఆంక్షలు అమలులొకొచ్చాయి. దీంతో తెలంగాణ సర్కార్‌ ఈ దిశగా నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉంది అన్న చర్చ మొదలైంది.


గతంలో వచ్చిన కరోనా వైరస్ వేరు..ఇపుడు అది మారిన తీరు విభిన్నం. ఒకప్పుడు వైరస్‌ బారిన పడితే తుమ్ము, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు చూపిస్తూ 14 రోజులు టైం ఇచ్చేవారు. 60 ఏళ్లు దాటికి వారికి తీవ్రంగా మధ్య వారిపై స్వల్ప ప్రభావం చూపేది. ప్రస్తుతం కరోనా వైరస్‌…అత్యంత ప్రమాదకర స్థితిలో చేరుకుందని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. లక్షణాలు కనపడకుండా వయసుతో సంబంధం లేకుండా మూడు పదుల వయస్సున్న సరే మృత్యువు ముంగిట నిలబడేలా చేస్తోంది.

తెలంగాణలో సినిమా థియేటర్లు, ఆహ్లాదాన్ని పంచే పార్కులు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్ నడుస్తున్నాయ్. జనం ఎక్కువ సంఖ్యలో గుమిగూడటం వల్ల…కరోనా కేసులు పెరుగుతున్నాయ్. వీటన్నంటినిపై కొన్ని రోజులు కర్ఫ్యూ లాంటి ఆంక్షలు అమలు చేస్తే..వైరస్‌ కట్టడి చేయవచ్చని సర్కార్‌ భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో మహారాష్ట్ర పరిస్థితులు పునరావృతం అయ్యేలా కనిపిస్తున్నాయ్. హైదరాబాద్‌లో అన్ని ఆస్పత్రులు కోవిడ్ పేషెంట్లతో నిండిపోయాయ్. ఐసీయూ, ఆక్సిజన్‌, సాధారణ బెడ్లు ఇలా ఏ ఒక్కటి దొరకడం లేదు.

ఢిల్లీ, రాజస్థాన్‌, పంజాబ్ రాష్ట్రాల్లో కోవిడ్‌ ఉధృతి ఎక్కువగా ఉండటంతో అక్కడ రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 9గంటల తర్వాత అత్యవసరమైన వాహానాలను మాత్రమే అనుమతిస్తున్నారు. కరోనా కట్టడికి నిబంధనలకు కఠినంగా అమలు చేస్తున్నాయి ఆయా రాష్ట్రాలు. ఉత్తరాది రాష్ట్రాల్లాగే కోవిడ్‌ నియంత్రణకు ఆంక్షలు అమలు చేసే అవకాశాలు మన దగ్గరా ఉన్నాయి. ఇప్పటికే పదవ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version