హరీశ్‌రావు మీటింగ్‌లో కరెంట్‌ కట్‌.. మార్పు వచ్చిందంటూ సెటైర్లు

-

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందో.. లేదో… ఎడాపెడా కరెంట్‌ కోతలు విధిస్తూనే ఉన్నారు. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మీటింగ్‌లోనూ ఇదే సమస్య ఎదురైంది.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జనగామ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ…. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న కరెంట్‌ పరిస్థితి గురించి వివరించారు. సరిగ్గా కరెంట్‌ పరిస్థితిని వివరిస్తుండగానే కరెంటు పోయింది. దీంతో మార్పు వచ్చిందంటూ హరీశ్‌రావు సెటైర్‌ వేశారు. ఈ మాట వినగానే సభ అంతా నవ్వులతో నిండిపోయింది. కాగా, జనరేటర్‌ ఆన్‌ చేయడంతో హరీశ్‌రావు మళ్లీ తన ప్రసంగం కొనసాగించారు.ప్రతిపక్షంలో ఉన్నా తమది ఎప్పుడూ ప్రజాపక్షమేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 60 రోజులు అవుతున్నా హామీలు అమలు చేయట్లేదు. 6 గ్యారంటీల అమలులో జాప్యం చేస్తోంది. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట తప్పారు. ఒక నెల పెన్షన్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదు అని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version