నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది.దీనికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహించనున్నారు. ఢిల్లీలోని హోటల్ అశోకలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుండగా.. వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభా పక్ష నేతలు, పీసీపీ ప్రత్యేక ఆహ్వానితులు అటెండ్ కానున్నారు.
తెలంగాణ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర రాజనర్సింహ, చల్లా వంశీచంద్ రెడ్డి హాజరుకానుండగా.. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, పల్లం రాజు, కొప్పల రాజు, గిడుగు రుద్రరాజు మీటింగ్కు హాజరుకానున్నారు. మహారాష్ట్ర , హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశాలు ఉన్నా పార్టీ ఓటిమికి గల కారణాలను విశ్లేషించనున్నారు. తప్పు ఎక్కడ జరిగింది, లోపాలను ఎలా సవరించుకోవాలనే అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.