కేసీఆర్ అంటే కాదు పేరు..తెలంగాణ మట్టిలో పుట్టిన పోరు : గంగుల

-

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు దీక్షాదివాస్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ రైతు పండుగ, విజయోత్సవాల పేరిట ప్రభుత్వం చేసిన మంచి పనులకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ దీక్షాదివస్ పేరిట ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు పెడుతోంది.

తాజాగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దీక్షాదివస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘కేసీఆర్ అంటే కాదు పేరు..తెలంగాణ మట్టిలో పుట్టిన పోరు.కొండంత బలగాన్ని ముందుండి నడిపిండు..చరితలో చెరగని గుర్తై నిలిచిండు. ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు’ అని పేర్కొన్నారు. అదేవిధంగా దీక్షా దివస్ సందర్భంగా మాజీ మంత్రి గంగుల ఆధ్వర్యంలో ప్రత్యేక పాటను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news