తీరం వైపునకు దూసుకొస్తున్న ‘దానా’ తుఫాన్.. వారికి కీలక హెచ్చరిక..!

-

దానా తుఫాన్ తీరం వైపునకు దూసుకొస్తుంది. తూర్పు మధ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న దానా తుఫాన్.. రేపటికీ వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ గా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. గడిచిన 6 గంటలలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్.. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. పూరి-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా ధమ్రా సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది.

ప్రస్తుతం పారాదీప్ (ఒడిశా) కి 520 కిలోమీటర్లు.. స్వాగర్ ద్వీపానికి (పశ్చిమబెంగాల్) 600 కిలోమీటర్ల దూరంలో దానా తుఫాన్ కొనసాగుతోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి ఈ రోజు మధ్యాహ్నం నుంచి గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రేపు రాత్రి నుంచి 100-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్త పేర్కొంది. ముఖ్యంగా ఇవాళ, రేపు సముద్రంలో అలజడిగా ఉంటుంది. మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది విపత్తుల నిర్వహణ సంస్థ.

Read more RELATED
Recommended to you

Exit mobile version