ఆ నలుగురి ఇజ్జత్ కీ సవాల్ గా మారిన కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక..

-

కరీంనగర్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది.. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి.. కలిసొచ్చే అంశాలను లెక్కలేసుకుంటున్నాయి.. ప్రధాన, ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్యనేతలకు ఈ ఎన్నికలు ఇజ్జత్ కా సవాల్ గా మారాయి.. ఈ ఎన్నికల్లో అభ్యర్దులు ఓడినా.. గెలిచినా.. ఆ నలుగురి మీదే అందరి దృష్టి ఉండబోతోంది..దీంతో వారు స్టాటజీతో ముందుకెళ్తున్నారు..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు జనవరి మొదటి వారంలో నోటిపికేషన్ రాబోతుంది.. పిబ్రవరి చివరి వారంలో ఎన్నికల జరగనుంది.. ఈ ఎన్నికల్లో గెలిచి సిట్టింగ్ స్తానాన్నినిలబెట్టుకోవాలని కాంగ్రెస్ కసితో ఉంటే.. ఈసారి జెండా పాతాలన్న లక్ష్యంతో కమలం, కారు పార్టీలు పనిచేస్తున్నాయి.. అధికారం ఉన్న సమయంలోనే కారు పార్టీ ఈ స్థానం నుంచి గెలవలేకపోయింది.. కానీ సారి మాత్రం బలమైన అభ్యర్దిని బరిలోకిదింపేందుకు పావులు కదుపుతోంది..

కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేతలుగా మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు ఉమ్మడి కరీంనగర్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. వీరిద్దరు ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతున్నారనేది ఆసక్తికరంగా మారింది.. ఏ మాత్రం తేడా కొట్టినా.. పార్టీలో వారికి గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం ఉంటుందని పార్టీలో చర్చ నడుస్తోంది..దీంతో వీరిద్దరూ ఇప్పటి నుంచే ఒకే స్టాటజీతో నేతలతో చర్చలు జరుపుతున్నారు.. మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్.. ఈ ఎన్నికపై గురి పెట్టింది.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిద్యం వహించే సిరిసిల్ల కూడా ఈ పట్టభద్రుల పరిధిలోనే ఉంది.. దీంతో ఆయన ఇజ్జత్ కీ సవాల్ గా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మారింది..

కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ధీటుగా వ్యవహరిస్తోంది బీజేపీ.. రాష్టంలో బిజేపీ గెలిచిన ఎనిమిది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉన్నారు. నలుగురు ఎంపీలు కూడా ఉన్నారు.. కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో ఆయన కూడా ఈ స్తానంపై పట్టు సాధించాలని పట్టుదలతో ఉన్నారు.. ముఖ్యనేతలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.. పట్టభద్రుల స్థానంలో ఎవరి పట్టు ఎంతో.. ఎవరి ప్రభావం ఏమేరకు ఉంటుందో.. కొద్దిరోజుల్లో తెలియబోతోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version