ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వేధిస్తున్న ఓ సమస్య తీరం దాటిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న పెను ముప్పు తప్పిడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ ముప్పుతో గుండెల్లో గుబులతో గజ గజ వణికిపోతున్న ప్రజలకు ఇది తీపి కబురే అని చెప్పక తప్పదు. ఇంతకు రెండు తెలుగు రాష్ట్రాలకు తప్పిన ముప్పేంటీ.. ఏ సమస్య తీరం దాటిపోయింది.. అనుకుంటున్నారా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న అతి పెద్ద ప్రమాదం తుఫాన్. ఈ తుఫాన్ తో పట్టణాలు, పల్లెలు అనే తేడాల లేకుండా గజగజ వణికిపోతున్నాయి. ఈ తుఫాన్‌తో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియని ఆయోమయ పరిస్థితిలో ప్రజలు, పాలకులు ఉన్నారు.
ఓవైపు రుతుపవనాలతో కురుస్తున్న వర్షాలతోనే ప్రజలు ఇంత భయందోళనలు వ్యక్తం చేస్తుంటే.. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో హికా తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. ఈ తుఫాన్ ప్రభావం మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో తెలుగు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తేలికపాటి నుంచి హికా తుఫాన్ ప్రభావంతో కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే.
మూడు రోజులు పాటు ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని, హికా అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని భయ పడిన ప్రజలకు వాతావారణ శాఖ శుభవార్తను తెలిపింది. ఈనెల 24న రాత్రి హికా తుఫాన్ తీరం దాటిందట. అయితే అది కాస్త తన దిశను మార్చుకుని గల్ఫ్ వైపు ప్రయాణిస్తుందట. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఏ ప్రాంతంపై హికా ప్రభావం ఉండదని వాతావరణ శాఖ అధికారి రాజారాం స్పష్టం చేశారు. హికా ప్రభావంతో దక్షిణ మహారాష్ట్ర దీనిని ఆనుకుని ఉన్న గోవా, కర్నాటక, తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
2018లో మే నెలలో కేరళను రుతుపవనాలు తాకాయి. జూన్ 21న కోస్తా, రాయలసీమలో జూన్ 22న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయన్నారు. పశ్చిమ, ఉత్తర తెలంగాణాల్లో సెప్టెంబర్ 27వ తేదీన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, సెప్టెంబర్ 28 నుంచి తేలిక పాటి నుంచి వర్షాలు కురుస్తాయన్నారు. సో హికా తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై లేదని తేలడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.