రోజుకో కప్పు చాయ్ తాగండి.. చాలు…!

-

ఒరేయ్ ఎదవా లేవరా? పొద్దెక్కినా ఇంకా లేవడు వీడు.. అంటూ ప్రతి తల్లీతండ్రీ ప్రతి రోజూ తమ పిల్లలను తిడుతూనే ఉంటారు. అబ్బ.. ఓ మాంచి చాయ్ తీసుకురా అమ్మా.. తాగి లేస్తా? అంటారు కొంతమంది. దాన్నే బెడ్ చాయ్ లేదా బెడ్ కాఫీ అంటారు. పొద్దుపొద్దుగాల చాయ్ ఎందుకు తాగాలనిపిస్తుంది. తాగితే ఏమౌతుంది. పొద్దున్నే కప్పు చాయ్ తాగితే.. నిద్ర మత్తు వదిలి.. బద్దకం పోయి.. మనసు కాస్త కుదుటపడుతుంది. తర్వాత లేచి పనులు చేసుకోవచ్చు అన్నమాట. అయితే.. ఇది అందరికీ తెలిసిందే. మరి మనకు తెలియనిది ఒకటుంది..

రోజూ ఒక కప్పు టీ తాగే అలవాటు ఉన్నవాళ్లలో ఎముకలు దృఢంగా ఉంటాయట. రోజూ టీ తాగేవాళ్ల ఎముకలు బలంగా తయారవడంతో… వాళ్ల ఎముకలు విరిగిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. ఈ విషయాలన్నింటినీ పరిశోధన చేసి మరీ తెలుసుకున్నారట పరిశోధకులు. అయితే.. టీలో చాలా రకాలు ఉంటాయి కదా. ఏ టీ అయినా పర్వాలేదు కానీ.. అదే టీని రోజూ తీసుకోవాలట. అది గ్రీన్ టీ అయినా.. మామూలు టీ అయినా.. మరో టీ అయినా.. దాన్నో నిత్యం తీసుకోవాలట. అది కూడా లిమిట్ లో ఉండాలట. రోజూ ఒక కప్పు లేదంటే ఇంకో కప్పు.. అంతకు మించి ఐదారు కప్పులు తాగితే మాత్రం అసిడిటీ, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news