వర్మ పై చర్యలు తీసుకోవాల్సిందే : దళిత సంఘాలు

-

రాంగోపాల్ వర్మ అంశం గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఇతర దర్శకులు సినిమా షూటింగులకు దూరంగా ఉంటున్నారు. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం ఎక్కడ షూటింగ్ తీస్తున్నాడో ఎలా షూటింగ్ తీస్తున్నాడో అన్నది తెలియట్లేదు కానీ వరుసగా సినిమాలను విడుదల చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇక రామ్ గోపాల్ వర్మ సినిమాల పై ఎన్నో విమర్శలు కూడా వస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా రామ్ గోపాల్ వర్మపై ఎస్సీ ఎస్టీ దళిత సంఘాలు భగ్గుమన్నాయి. వెంటనే వర్మ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రామ్ గోపాల్ వర్మ మర్డర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటూ… దళిత సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టాయి దళిత సంఘాలు.ఈ సందర్భంగా ఆన్ లైన్ లో రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version