ఆన్లైన్ లో సంచనాలు సృష్టిస్తోన్న సుశాంత్ “దిల్ బెచారా”…!

-

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్ చివరి సినిమా ‘దిల్​ బెచారా’ (జులై 24) ఓటీటీ ప్లాట్​ఫామ్ వేదికగా హాట్​స్టార్​లో విడుదలై.. అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన సుశాంత్ కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం నివాళులు అర్ఫించారు. ‘దిల్​ బెచారా’.. అభిమానుల నుంచి విశేషాదరణ పొందుతోంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే, ఏ చిత్రానికి సాధ్యం కాని రీతిలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఐఎమ్​డీబీలో తొలుత 10/10 మార్క్​ను అందుకుంది. ప్రస్తుతం 9.8 రేటింగ్​తో ఉంది. దీనితో పాటే ‘టాప్ రేటెడ్ ఇండియన్ మూవీస్’ జాబితాలో తొలి స్థానం చేజిక్కుంచుకుంది.

Dil-Bechara

జున్ 14న తన సొంత ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్. అతడు నటించిన చివరి చిత్రం ‘దిల్ బెచారా’​ను థియేటర్లలోనే విడుదల చేయాలని అభిమానులు కోరారు. కానీ కరోనా వల్ల ఓటీటీలో తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా థియేటర్లో కానీ రిలీజ్ అయి ఉంటే ఒక్కరోజులోనే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టే అవకాశాలున్నాయి అని విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version