ఆస్ట్రేలియా టీంకు బిగ్ షాక్. ఆస్ట్రేలియా వెటరన్ ఆల్ రౌండర్ డాన్ క్రిస్టియన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. బిగ్ బాష్ లీగ్ 2022-23 సీజన్ తోనే అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు స్టేట్మెంట్ ద్వారా తెలియజేశాడు. 39 ఏళ్ల డాన్ క్రిస్టియన్ తన కెరీర్ లో 405 టీ 20 మ్యాచ్ లు ఆడి 5809 పరుగులు, 280 వికెట్లు తీశాడు.
బిగ్ బాష్ లీగ్ లో బ్రిస్బెన్ హీట్, హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ టీమ్స్ తరఫున ఆడిన డాన్ క్రిస్టియన్ ప్రస్తుతం సిడ్నీ సిక్సర్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా తరఫున 23 టీ 20 మ్యాచ్ లు, 20 వన్డేలు ఆడాడు క్రిస్టియన్. కాగా, క్రిస్టియన్ ఐపీఎల్ లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ , బెంగళూరు తరఫున మంచి ప్రదర్శనను కొనసాగించాడు క్రిస్టియన్.